సంచలన సర్వే: రజనీకాంత్ దుమ్ము రేపుతాడట

సంచలన సర్వే: రజనీకాంత్ దుమ్ము రేపుతాడట

చెన్నై: వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ దుమ్ము రేపుతాడట. దినమలర్ అనే స్థానిక పత్రిక నిర్వహించిన సర్వే తమిళాడులో సంచలనం రేపుతోంది.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్ ప్రభంజన వీస్తుందని, ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెప్పింది. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీకాంత్ చాలా రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇప్పటి వరకు ఆయన పార్టీ పేరును గానీ పార్టీ విధివిధానాలను కూడా వెల్లడిచలేదు. రజనీకాంత్ నటించిన కాలా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని అంటన్నారు.

రజనీకాంత్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. తమిళనాడు శాసనసభలో 234 సీట్లు ఉన్నాయి. తాజా సర్వే డిఎంకె, అన్నాడియంకెల్లో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ పాపులారిటీ కారణంగానే బిజెపి ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos