తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్  (వీడియో)

భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు వంద రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు.కలెక్టరేట్ ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పు ల్లో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఘటనపై తన ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా స్టేట్ మెంట్ ఇచ్చారు. తూత్తుకుడి ఆందోళనకారులని పోలీసులు బుల్లెట్స్ తో బెదరగొట్టడం అవాంచనీయమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు.

Scroll to load tweet…