అమరావతి మీద లండన్ లో ప్రత్యేక చర్చలు
అమరావతి పాలనా నగరం డిజైన్ల గురించి చర్చించేందుకు లండన్ వెళ్లేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు.అక్టోబరు 11, 12, 13 తేదీలలో లండన్ నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై రాజమౌళి కోసం ఒక వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పాల్గొని బాహుబలి దర్శకుడు తన సూచనలను అందిస్తారు. ఈ వర్క్ షాపులో తన బృందంతో పాల్గొని తగు సలహాలు, సూచనలు అందించడానికి తెలుగు చలనచిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంసిద్ధత వ్యక్తం చేశారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు.
ఈ సూచనలను కూడా జోడించి నార్మన్ ఫోస్టర్ కంపెనీ అమరావతి పాలనానగరానికి తుదిరూపం ఇస్తుంది. వాటిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ వెళ్తున్నారు.
లండన్‌లో నార్మన్ ఫోస్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక సమావేశమయిన కొత్త నమూనాలను పరిశీలించేందుకు అక్టోబరు 24, 25 తేదీలను ఖరారు చేశారు.
గతంలో ఫోస్టర్ అందించిన నమూనాలు బాగా లేవని ముఖ్యమంత్రి తిరస్కరించిన విషయం తెలిసిందే.
అపుడే ఆయన రాజమౌళిని రంగంలోకి దిగమన్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం కోసం రూపొందించిన మహిష్మతి రాజ్య రాజధాని చూసి ముఖ్యమంత్రి నాయుడు ఢంగై పోయారు. అందువల్ల అలాంటి లక్షణాలు కొన్నైనా అమరావతికి ఉండాలని కోరుకుంటున్నారు. రాజమౌళితో ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపారు. ఇపుడు లండన్ కుపంపి కీలకమయిన చర్చలలో భాగస్వామ్యం క ల్పించాలనుకుంటున్నారు. ఇపుడు రాజమౌళి సూచనలతో, చంద్రబాబు నాయుడు సలహాలతో 25న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తుది ఆకృతుల సమర్పిస్తారుని అనుకుంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి
http://telugu.asianetnews.com/home-page/asianet-telugu-crime-news-andhra-pradesh-and-telangana-18
