తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు హాజరైన సినీ ప్రముఖులు

దర్శకధీరుడు రాజమౌళి.. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని, అసెంబ్లీ నిర్మాణాల ఆకృతులను ఎంపిక చేయడంలో తన విలువైన సూచనలు చేశాడు. తాజాగా..తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేశాడు. కాకపోతే రాజధాని, అసెంబ్లీలకు సంబంధించినది కాదులేండి.

అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టు అట్టహాసంగా ‘ ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహాసభలకు సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఆహ్వానం అందుకున్న వారిలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతోపాటు రాజమౌళి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కి ఒక ఉచిత సలహా ఇచ్చారు.

‘‘నేను ఒకసారి తమిళనాడు వెళ్లినప్పుడు అక్కడ కొందరు చిన్నారులు ఆలయాల్లో తిరుక్కరల్ పుస్తకంలోని కథలను వివరిస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారని నేను వాళ్లని అడిగితే.. తమ ప్రభుత్వం చేపట్టిన కొత్త స్కీమ్ అదని.. కథలను మంచిగా వివరించిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుందని ఆ చిన్నారులు చెప్పారు. ఇలాంటి స్కీమ్ ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టవచ్చు కదా? వేమన శతకం లాంటి ఇతర పద్యాలను చిన్నారుల చేత పాడించవచ్చు కదా’’ అని చెప్పారు. ప్రపంచ మహాసభలలో వేమన ఎక్కడ కనిపించలేదు.ఉన్నా ఎక్కడో మరుగున ఉన్నట్లే లెక్క. రాజమౌళి సూచన బాగుంది. కానీ ఆయన ఆంధ్రావాడు కదా, రాజమౌళి సూచన పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అది అడ్డొస్తుందేమో...