ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను అందజేస్తారు. ఈ ఏడాది ఇప్పటికే మెడిసిన్ రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించగా.. మంగళవారం భౌతిక శాస్త్రంలో మరో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు.  రైనర్ వైసిస్, బ్యారీ సీ.బారిష్, కిప్ ఎస్, థ్రోన్ అనే ముగ్గురి పేర్లను నోబెల్ కమిటీ  ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో వీరి ఎనలేని కృషికి గానూ వీరికి నోబెల్ అందజేస్తున్నట్లు కమిటీ తెలిపింది.

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గురించి ఆసక్తికర విషయాలు..

1.1901 వ సంవత్సరం నుంచి 2017 వరకు ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో  111 నోబెల్ బహుమతులను అందజేశారు.

2. వ్యక్తిగతంగా 47మంది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.

3.ఇప్పటి వరకు భౌతిక శాస్త్రంలో ఇద్దరు మహిళలు నోబెల్ బహుమతిని అందుకున్నారు.

4. జాన్ బార్డెన్ అనే వ్యక్తి భౌతిక శాస్త్రంలో రెండు సార్లు నోబెల్ బహుమతిని అందుకున్నారు.

5.ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వారిలో  అత్యంత తక్కువ వయసు 25 కాగా, అత్యంత ఎక్కువ వయసు 55.  

6.లారెన్స్ బ్రాక్ అనే వ్యక్తి 1915లో ఈ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలో ఆయన వయసు 25 సంవత్సరాలు.