చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా.. గాయాలపాలయ్యాడు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా తొడకు గాయమైంది.  అతడు గాయం నుంచి కోలుకునేందుకు కనీసం పది రోజులైనా పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.అంటే  ఈ పది రోజుల్లో చెన్నై ఆడే మ్యాచ్‌లకు రైనా దూరం కావాల్సిందేనని అర్థమౌతోంది. కాగా  రైనా స్థానంలో ఎవర్ని జట్టులోకి తీసుకోవాలన్న దానిపై ధోనీతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ కసరత్తులు చేస్తోంది. 


మొన్నటికి మొన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ తర్వాత కేదార్‌ జాదవ్‌ మొత్తం ఈ టోర్నీకే దూరం అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. రైనా కూడా కొంత కాలం దూరం అవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ కి దెబ్బే.ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన చెన్నై హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. టోర్నీలో భాగంగా చెన్నై మొహాలీ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఢీకొట్టనుంది. కావేరీ జల వివాదానికి సంబంధించి చెన్నైలో ఉద్థృతంగా ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో చెపాక్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ పుణెకు తరలించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.