రైల్వే స్టేషన్ ను కొనేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. కాసేపైనా స్టేషన్ ను మీ సొంత ఆస్తిగా భావించవచ్చు.
అత్తారింటికి దారేది సినిమాలో రైల్వే స్టేషన్ ను ఓ అరగంట అద్దెకు తీసుకుంటాడు హీరో.. సినిమా కాబట్టి మనమూ నమ్మేశాం.
ఇప్పుడు నిజంగా ఎవరైనా రైల్వే స్టేషన్ ను అద్దెకు తీసుకున్న ఇక నమ్మాల్సిందే.
ఎందుకంటే రైల్వే స్టేషన్ లను కూడా అద్దె కు ఇవ్వబోతున్నారు.
కాకపోతే కేవలం ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్ లనే.. వాటిని పెళ్లి మండపాలు, ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించుకోడానికి వీలుగా అద్దెకు ఇస్తారు.
ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి వద్ద ఇప్పటికే ఓ ప్రతిపాదన ఉందట. త్వరలో ఇది పట్టాలెక్కబోతున్నట్లు తెలిసింది.
ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్లను వేరే ప్రాంతాలకు తరలించే బదులు వాటిని ఇలా మార్చడం వల్ల రైల్వే కి అదనపు ఆదాయం వస్తుందని ఈ కొత్త ఐడియా కనిపెట్టారు.
