జనవరి 5న రాయచూర్ కోర్టు ముందుకు రానున్న టిఆర్ ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బ్లాక్ మనీ కేసు

టిఆర్ ఎస్ (టిడిపి) నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పెద్ద ఎత్తున పన్నుల ఎగవేయడానికి సంబంధించిన కేసు జనవరి అయిదో తేదీన కర్నాటక, రాయచూర్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ( జెఎం ఎఫ్ సి) ముందు విచారణకు వస్తున్నది.

సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్ రెండో వారంలో రాజేందర్ రెడ్డికి చెందిన నవోదయ ఎజుకేషన్ సొసైటీ మీద అదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపి దాదాపు 20 కోట్లు లెక్కలేని సొమ్ము స్వాదీనం చేస్తుకున్నారు. అంతేకాకుండా దాదాపు మరొక 500 కోట్లకు లెక్కలు తేలకపోవడం పన్ను ఎగవేతకు సంబంధించిన మీద కేసు నమోదు చేసింది. ఈకేసులే ఇపుడు రాయచూరు జెఎంఎఫ్ సి ముందు విచారణకొస్తున్నయ్.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాజేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 

దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా రేపు రాయచూర్ కోర్టులో విచారణకు రానున్నది. రాజేందర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా 2014 లో నారాయణ్ పూర్ నుంచి అసెంబ్లీ గెలుపొందారు. నవోదయ ఎడ్యకేషన్ ట్రస్టుకు ఆయన ఛెయిర్మన్.

ఈ ట్రస్టు అనేక డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలను తెలంగాణాలలో నడుపుతూ ఉంది. ఎన్నికల అపిడవిట్ లో కూడా తన అస్తుల విలువ 29 కోట్లుగా ఆయన చూపించారు.ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందినా, ఆయన ఫైనాన్సియల్ కాపిటల్ మాత్రం రాయచూరేనని చెబుతారు. ఆయన ఎంఫార్మసీ చదువుకున్నది కూడా రాయచూర్ లోనే.

ఐటి దాడులు జరిగిన రెన్నెళ్లలోనే అంటే ఫిబ్రవరి 2016 లో టిడిపికి గుడ్ బై కొట్టి తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు. ఈ దాడులు నుంచి రక్షణ కోసమే ఆయన రూలింగ్ పార్టీలోకి వచ్చారని చెబుతారు.