తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్ల పార్టీగా మారిపోతున్నదా?

కాంగ్రెస్ హై కమాండ్ ఈ విషయం గురించి యోచిస్తున్నట్లు సమాచారం అందింది. ఇది నిజమయినా, కేవలం ఫిర్యాదే అయినా ఇలాంటి భావనను పార్టీలోని ఇతర కులాల, వర్గాల నాయకుల్లో వేళ్లూన కుండా ఉం  డేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు ఈ మధ్య అధిష్టానంతో ఈ విషయం గురించిన చర్చించిన  నాయకుడొకరు ‘ఏసియానెట్’ కు చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇపుడు రేవంత్ రెడ్డికి మరొక పెద్ద పదవి కట్టబెడతారు, అంతా రెడ్డకేనా అంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు  న్యూఢల్లీ 24, అక్బర్ రోడ్ కు వెల్లువెత్తాయి. ఇది నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఫిర్యాదు చేసిన వారిలో సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు లెజిస్లేటర్లు కూడా ఉన్నారని తెలిసింది.

ఇపుడు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బాగా ఉపందుకుందని ఇలాంటపుడు  రెడ్ల ముద్ర పడి అపకీర్తి పాలయితే,దాని ప్రభావం 2019 ఎన్నికల్లో పడే ప్రభావం ఉందని హైకమాండ్ లో అందోళన లో ఉంది. అందువల్ల పార్టీ లో కొన్ని మార్పులు చేసి అన్ని వర్గాల నాయకులు కనిపించేలా చర్యలు తీసుకోబోతున్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత హైకమాండ్ దృష్టి పెట్టేది తెలంగాణ మీద, ఆంధ్ర ప్రదేశ్ మీదేనని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఆంధ్రలో పునరుర్ధరణకు చర్యలు తీసుకోవడం గురించి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక ప్రత్యేక మేధోమధనం జరిపే అవకాశం ఉందని తెలిసింది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇది జరగవచ్చు. ‘గుజరాత్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ 2019 ఎనికలకు టర్నింగ్ పాయింట్ కానున్నాయి. గుజరాత్ లో పార్టీ గెలిస్తే, అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కమిటీలను గుజరాత్ కాంగ్రెస్ మోడెల్ లోకి తీసుకురావాలి. ఒక వేళ పార్టీ దెబ్బతింటే, పార్టీ బలంగా ఉన్న తెలంగాణ, కర్నాటకలలో ఇంకా పటిష్టం చేసుకోవాలి. కాబట్టి  ఏవిధంగా చూసినా తెలంగాణకు పెద్ద పీట వేస్తున్నారు,’ అని ఢిల్లీ నాయకుడొకరు చెప్పారు.

ఇప్పటికే ఒక వర్గం పిసిసి అధ్యక్షుడి ఉత్తమ్ ను మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నది. అదే విధంగా ఏదో ఒక అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి వెళ్లిపోతారనే అనుమ నాలు కూడా ఉన్నాయి. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీద బాగా అనుమానాలున్నాయి. సంపత్ వెళ్లిపోయేందుకు టిడిపి నుంచి వచ్చిన రేవంత్ కు పెద్ద పీట వేస్తుండటమే అనే అంటున్నారు.

పార్టీ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా నోరున్న రేవంత్ కు ముఖ్య మయిన పదవి ఇస్తే, ఇతర కులాలకు సమానంతో విజిబిలిటీ ఇవ్వాలని, లేకపో తే అసమ్మతి ప్రబలుతుందని పార్టీ నమ్ముతూ ఉంది. అందుకే పునర్వ్యవస్తీకరణ ఉంటుందని చెబుతున్నారు. రాబోయే 2019 వార్ టీమ్ అని, అన్ని కులాల వారికి అన్ని రకాల బాధ్యతలుంటాయని తెలిసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఇన్ చార్జ్ జనరల్ సెక్రెటరీ కుంతియాను మర్చి మరొకరిని నియమిస్తే ఎలా ఉంటుందున్న విషయం కూడా పరీశీలనలో ఉన్నట్లు తెలిసింది.