ఈ నెల 16న పదవీ బాధ్యతలు తీసుకోనున్న రాహుల్ గాంధీ
రాహుల్ కాంగ్రెస్ రాజయ్యాడు
కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు పార్టీ ఎన్నికల అధారిటీ ప్రకటించింది.
ఎఐసిసి ఎలెక్షన్ అధారిటీ ఛెయిర్మన్ ముల్లపల్లి రామచంద్రన్ ఈ విషయం ప్రకటించారు. మొత్తం 89 నామినేషన పత్రాలు దాఖలయ్యాయని, అవన్నీ కూడా రాహుల్ కు మద్దతుగా నే అని ఆయన చెప్పారు. అందువల్ల రాహుల్ పోటీ లేకుండా ఎంపికయ్యారని ఆయన ప్రకటించారు.
ఈ నెల 16వ తేదీన పట్టాభిషేకం అంటుంది.
కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల అధారిటీ చాలా స్వయం ప్రతిపత్తితోపని చేసిందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాంటి జోక్యం చేసుకోకుండా, ఎన్నికల ప్రాసెస్ కు దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఉత్తమ్ హర్షం
ఏఐసీసీ అధ్యకులుగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి రాం చంద్ర కుంతియా, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
