కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పేరును మార్చుకున్నాడు. రాజకీయాల్లో కలిసి రావాలనో, న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నాడనో అపోహ పడకండి. ఆయన పేరు మార్చుకున్న మాట వాస్తవమే కానీ.. అది ట్విట్టర్ లో. 2015 ఏప్రిల్ లో తొలిసారి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తెరిచారు. అప్పుడు ఆఫీస్ ఆఫ్ ఆర్జీ పేరిట ఎకౌంట్ ఓపెన్ చేశారు. కాగా.. తాజాగా దానిని రాహుల్ గాంధీ పేరిట మార్చుకున్నారు.

తెరవడానికి 2015లోనే ఎకౌంట్ ఓపెన్ చేయగా.. గతేడాది నుంచి మాత్రమే చురుకుగా పాల్గొంటున్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీపై ట్వీట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక సమయంలో.. రాహుల్ గాంధీ ట్విట్టర్ ని వేరెవరో నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు కూడా చేశారు. దానికి సమాధానంగా తన పెంపుడు కుక్క ట్వీట్లు చేస్తోందంటూ రాహుల్ ట్వీట్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం రాహుల్ ట్విట్టర్ ను 60లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.