ప్రతి పేద కుటుంబం అకౌంట్ లో  ప్రభుత్వం రు  25 వేలు జమచేయాలి

నోట్ల రద్దు అమలు గడువు పూర్తవుతున్న మోదీ దెబ్బతగిలి నష్టపోయిన ప్రతి పేద కుటుంబం అకౌంట్ లో నష్టపరిహారంగా ప్రభుత్వం రు.25 వేలు జమచేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడుగుతున్నారు.

డిసెంబర్ 31 గడువు ముగుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీకి అయిదు ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ ప్రధాని మోదీని బుధవారం నాడు అడిగారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.


కాంగ్రెస్ ప్రశ్న లివే...


1. నవంబర్ 8 నోట్ల రద్దు ప్రకటన తర్వాత బయటపడిన బ్లాక్ మనీ ఎంత?


2.ఈ 50 రోజులలో దేశానికి జరగిన నష్టమంత? నవంబర్ 8 నుంచి ఇప్పటిదాకా పోయినఉద్యోగాలెన్ని, మాయమయిన ఉపాధి అవకాశాలెన్ని?


3. దేశ వ్యాపితంగా నోట్ల రద్దు నేలకొరిగిన అభాగ్యలెందరు? క్యూలలో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాల వారికి కేంద్రం ఎందుకు సహాయం చేయడంలేదు?


4. నోట్ల రద్దు తర్వాత రాబోయన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నవంబర్ 8 కి ముందుకు మీరు నిపుణులతో, ఆర్ధికవేత్తలతో, ఆర్బీఐ తో జరిపిన సంప్రదింపులేమిటీ, తీసుకున్న చర్యలేమిటి?


5. నవంబర్ 8 వ తేదీకి అరు నెలల ముందు రు. 25 లక్షల కంటే ఎక్కవ మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న వారి పేర్లను, సంస్థల పేర్లను ప్రభుత్వం బయటపెడుతుందా?

వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని ముందుంచింది.

* బ్యాంకుల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడం మీద అన్ని రకాల ఆంక్షలను సడలించాలి.

* ఒక ఏడాది పాటు చౌకదుకాణాలలో అందించే రేషన్ ధరలను సగానికి తగ్గించాలి.

*బిపిఎల్ కుటుంబాలలో కనీసం ఒక మహిళ పేరున ఉన్న అకౌంటులో రు. 25,000 జమచేయాలి.

*ఉపాధిహామీపథకం కింద ఏడాదిలో పని కల్పించే దినాలను రెట్టింపు చేయాలి.

*చిన్నచిన్న దుకాణాలకు, వ్యాపారాలకు అదాయపు పన్ను, సేల్స్ టాక్స్ లో 50 శాతం రిబేటు ఇవ్వాలి.