కాంగ్రెెస్ అధికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేక హోదా

First Published 6, Mar 2018, 2:44 PM IST
Rahul assures  special status to Andhra once the party comes to power at centre
Highlights

కాంగ్రెస్ అధికారంలోకి వస్తూనే ఎపికి ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ హామీ

 ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతుప్రకటించారు. అంతేకాదు, 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకిరాగానే మొట్టమొదట చేసేపని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడమే నని ఆయన  ప్రకటించారు. సిపిఐ,సిపిఎంలతోకలసి కాంగ్రెస్ ఎంపిలు,మాజీ  ఎంపిలు ఈ రోజు  ఢిల్లీలో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా చేశారు. ఈ ధర్నా దగ్గరుకు రాహుల్ గాంధీ వచ్చి ఈప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి పి మధు, పిసిసి అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరా రెడ్డి లు కూడా పాల్గొన్నారు.

 

loader