రేస్-3 సినిమా వివరాలు బ‌య‌టికి వ‌చ్చాయి. రేస్‌-3లో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారు. సల్మాన్ సరసన  జాక్వెలీన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. డైరెక్టర్ కూడా మారిపోయారు.

రేస్ సిరీస్ బాలీవుడ్ లో ఎంత‌ పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే, అయితే రేస్ సిరీస్ అభిమానులు రేస్-3 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌రకు ఆ సినిమాపై ఎలాంటి వివ‌రాలు బ‌య‌టికి రాలేదు. కానీ ఇప్పుడు రేస్-3 సినిమా వివరాలు బ‌య‌టికి వ‌చ్చాయి.

రేస్‌-3లో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారు. ట్యూబ్ లైట్ డీజాస్ట‌ర్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ స్టోరీ సెల‌క్ష‌న్ లో చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ "టైగ‌ర్ జిందా హై" లో న‌టిస్తున్నారు... ఇప్పుడు "రేస్ 3" చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలుపుతున్నాయి. ఇందులో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న‌ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే వ‌చ్చిన సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసుకున్న `రేస్‌`, `రేస్ 2` చిత్రాల‌కు కొన‌సాగింపుగా రేస్ 3 రాబోతుంది. 


ఇప్ప‌టి వ‌ర‌కు రేస్‌-1,రేస్‌-2లో సైఫ్ అలీ ఖాన్ న‌టించారు, ఇప్ప‌డు ఆయ‌న ప్లేస్‌లో స‌ల్మాన్ న‌టించ‌నున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే... గ‌త రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అబ్బాస్ - మ‌స్తాన్ లు కూడా రేస్‌-3 సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేదు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ వ‌హిస్తున్న‌ది కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌ రెమో డిసౌజా చేప‌ట్ట‌నున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి