కొలాయి కాడ కొట్లాట...( వీడియో)

కొలాయి కాడ కొట్లాట...( వీడియో)

కొలాయి కాడ కొట్లాట... నిజంగా అంతరించిపోతున్న ఒక కళ.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటిపథకాలు పూర్తిగా అమలయితే, ఈ ‘కొలాయి కాడ కొట్లాట’ అనే వీధి బాగోతం పూర్తిగా అంతరించిపోతుంది. అయితే, ఈ కళని కాపాడుకోవాలని ఒక మహాను భావుడికి అనిపించింది. ఆయన కు జోహార్. ఆధునికి టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్ ను ఉపయోగించి  మన మహానగరంలో ఒక చోట  ఈ వీధి బాగోతం  జోరుగా రసవత్తరంగా సాగుతున్నపుడిలా  వీడియో తీసి ఇలా నిక్షిప్తం చేశారు. 

కొలాయి కాడ కొట్లాట అనేది ఆంధ్రదేశంలో ప్రదర్శించబడిన చోటుండదు. పబ్లిక్ కొలాయి ఉన్న ప్రతిచోటా అడోళ్లు,మగోళ్లు, పిల్లా జల్లా అనే తేడా లేకుండా ఎపుడో ఒక సారీ  ఇందులో తన దైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అది ఫోక్ లెజండ్ అయిపోయింది.  జీవితంలోని అన్ని మూలల్లోకి ప్రవేశించింది. క్లాస్ లోనో, లేదా ఆఫీస్ లోనో ఎపుడయిన రగడ జరిగినపుడు ఏందిరా ఈ కొలాయి కాడ కొట్లాట లాగా అంటుంటారు. ఇంట్లో మొగుడు పెళ్లాల కొట్లాటలు కూడా అపుడపుడు ఈ ఉపమానంతో శోభిస్తూ ఉంటాయి. బాధకరమయినదేమిటంటే, రాబోయే తరాలకు పబ్లిక్కొలాయి అంటేఏమిటో, అక్కడ కొట్లాట ఏమిటో అర్థం కాని పరిస్థితి ఎదువరుతుూ ఉంది. 

ఈ వీడియో ముక్క ఆలోటు తీరుస్తుందని మేం ఏషియానెట్ తెలుగు కార్యాలయంలో భావిస్తున్నాం.ఈ వీడియోని ప్రతి ఇంటాయన, ప్రతిఇల్లాలు తమ సంతానికి, మునవళ్లకు మనవరాళ్లకి, వాళ్లు ఇండియాలో ఉన్నా, ఎబ్రాడ్ లో ఉన్నా చూపించి, ఈ కళను మొబైల్  స్క్రీన్ మీదనైనా సజీవంగా ఉంచాలని కోరుతున్నాం.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page