టిటిడి సలహాదారు పివిఆర్ కె ప్రసాద్ కనుమూత

pv media advisor PVRK prasad paases away
Highlights

ప్రధాని నరసింహారావుకు మీడియ ా సలహాదారు గా పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి పివిఆర్ కె ప్రసాద్ మృతి చెందారు

మాజీ ఐఎఎస్అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానంతో ఎనలేని బంధం ఉన్న  పివి ఆర్ కె ప్రసాద్ ఈ తెల్లవారుఝామున కనుమూశారు.  ఆయనకు భార్య కొడుకు కూతురు ఉన్నారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు ప్రధాని పివి నరసింహారావుకు ఆయన మీడియా సలహాదారుగా పని చేశారు. టిటిడి ఎగ్జిక్యూటివ్ )1978-82) గా ఆయన చేసిన  సేవలు మరవరానివి. ఆయన 1966 బ్యాచ్ కు చెందిన ఐఎస్ అధికారి. ఖమ్మం జిల్లాకలెక్టర్ గా పని చేశారు. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా ఉన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టు చెయిర్మన్ గా కూడా పని చేశారు. చదవుకు సంబందించి ఆయన ఎమ్మే ఇంగ్లీష్ చేసి బంగారు పతకం పొందారు. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ ఎస్ బి పట్టా పొందారు.

 రిటైరయ్యక కూడా ఆయన టిటిడి తో అనుబంధం తెంచుకోలేదు. సలహాదారుగా కొనియాడారు. అస్వస్థత కారణంగా  శనివారం తెల్లవారుఝామున ఆయనను ఆస్పత్రి చేర్చారు. ఐసియు లో చికిత్స చేయడం ప్రారంభమయింది.  ఈ తెల్లవారు జామున ఆయన చనిపోయారు.ఉదయం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక అంశాలతో కూడినఎన్నో  చక్కటి రచనలు చేశారు.  ఇందులో ‘అసలేం జరిగిందంటే,’ అనేది ఆయన జ్ఞాపకాలు. ఆంధ్రప్రదేశ్ లో, కేంద్రంలో  తాను చేపట్టిన ఎన్నో పదవులలో తాను చూసినవి,తన  ప్రమేయం ఉన్న అనేక ఘటనల సమాహారమే ఈ పుస్తకం.అసలేం జరిగిందంటే  పుస్తకంలో ఆయన  అనేక  అసక్తికరమయిన విషయాలను వెల్లడించారు. ఇందులో అయోధ్య రామాయాల నిర్మాణానికి సంబంధించిన  రహస్యం. ప్రధాని  పివి నరసింహా రావు అయోధ్యంలో రామాయలం నిర్మించాలనుకున్నారు. గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నారు. అయితే, 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నరసింహారావు ప్రాజక్టు ముందుకు పోలేకపోయిందని  ప్రసాద్ తన పుస్తకరం రాశారు.

ప్రసాద్ పలు భాషా కోవిదుడు. తెలుగుతో కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆయన రచనలు చేశారు.

 

loader