నల్లగా ఉన్నావని భార్యకు వేధింపులు, షాకిచ్చిన వైఫ్

Punjab And Haryana HC Grants Woman Divorce After Husband Calls Her 'Kali Kaluti'
Highlights

ట్విస్టిచ్చిన భార్య

చంఢీఘడ్: నల్లగా ఉందని బార్యను తరచూ వేధింపులకు గురిచేస్తున్న భర్తకు కోర్టు షాకిచ్చింది. భార్యచేసిన వంటను కూడ  తినకుండా  ఆమెను  నల్లగా ఉన్నావని  వేధింపులకు
గురిచేయడంతో  కోర్టు  భర్త నుండి  ఆమెకు విడాకులను మంజూరు చేసింది.  ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

హర్యానా రాష్ట్రంలోని మహేందర్‌గంజ్‌కు చెందిన  ఓ మహిళకు కొన్నేళ్ళక్రితం వివాహమైంది.  అయితే ఆమె నల్లగా ఉంటుంది. అయితే ఆమెను  భర్త ఎప్పుడూ నల్లమబ్బు అంటూ  
వేధింపులకు గురిచేసేవాడు.

అంతేకాదు ఆమె చేసిన వంటను కూడ తినేవాడు కాదు. ఆమెను వంటను  వంట గదిలో కూడ వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆమె అందంగా లేదంటూ వేధింపులకు పాల్పడేవాడు. ఈ వేధింపులుభరించలేక  ఆమె  భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది.

అయితే  ఈ విషయమై  తమ కూతురి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అల్లుడితో పాటు  ఆ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపారు.  కానీ, ఆ ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కాలేదు.అంతేకాదు తమ కొడుకుకు రెండో పెళ్ళి చేస్తామని కూడ వారు బెదిరించారు.

ఈ విషయమై బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. తన భర్త తనను అందవిహీనంగా ఉన్నావని చెబుతూ ఏ రకంగా కించపరుస్తున్నారో కోర్టులో ఆమె వివరించింది. అంతేకాదు మానసికంగా,శారీరకంగా తనను వేధింపులకు గురిచేసిన విషయాన్ని  ఆమె ప్రస్తావించింది.దీంతో కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. 
 

loader