Asianet News TeluguAsianet News Telugu

ఈ పోలీసు మొగుడు పెళ్లాలు ఎవరెస్టుతో ఆడుకున్నారు

  • మొదడులో వింత ఆలోచన పుట్టుకువచ్చింది
  • ఎవరెస్టు పర్వతం ఎక్కామని ప్రకటించారు
Pune Police Couple Who Faked Mount Everest Feat Dismissed From Force

 

ఇద్దరు భార్యభర్తలు.. ఇద్దరివీ.. ఉన్నతమైన పోలీసు ఉద్యోగాలే. ప్రశాంతంగా సాగిపోతోంది జీవితం. ఇంతలో వారి మొదడులో వింత ఆలోచన పుట్టుకువచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టారు.. తీరా చూస్తే.. వారి ఉద్యోగాలకే ఎసరుపడింది. ఇంతకీ ఆ భార్యభర్తులు ఏమి చేశారనేదేగా మీ ప్రశ్న.. చదవండి మీకే తెలుస్తుంది.

పూణెకి చెందిన  దినేశ్ రాథోడ్, టర్కేశ్వరి అనే ఇద్దరు భార్యభర్తలు.. పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ.. తాము ఎవరెస్టు పర్వతాన్ని  అధిరోహించామని..ఆ ఘనత సాధించిన తొలి భారతీయ దంపతులము తామేనని  గతేడాది మేలో ప్రకటించారు.కాగా.. వారు నిజంగా పర్వతారోహణ చేయలేదని.. ఎవరో ఎక్కినప్పుడు దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ పలువురు  ఆరోపించారు.

దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. నిజమేనని తేలింది. దీంతో పొలీసు శాఖ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.

తాజాగా.. తాజాగా దినేశ్‌ దంపతులను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సహిబ్రాయో పాటిల్‌ వెల్లడించారు. ప్రత్యేక ప్యానెల్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించగా దినేశ్‌ దంపతులు మోసం చేసినట్లు తేలిందని..దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పుణె పోలీసులు నేపాల్‌ ప్రభుత్వానికి సమాచారం అందించగా.. 10 ఏళ్ల పాటు దినేశ్‌ దంపతులకు తమ దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు గత ఏడాది ఆగస్టులో నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios