అధికార పార్టీ నేతలు చెబుతున్నదాన్ని బట్టి త్వరలో మరికొన్ని షాకులు తప్పవని అనిపిస్తోంది.
మోడి కొడుతున్న వరుస దెబ్బలకు దేశప్రజల మైండ్ బ్లాంక్ అయిపోతోంది. పూటకో నిబంధన, రోజుకో నియమం వెలుగు చూస్తుండటంతో దేశంలో ఏమి జరుగుతోందో అర్ధంకాక ప్రజలంతా గందరగోళంలో పడిపోతున్నారు. 25 రోజుల క్రితం పెద్ద నోట్ల రద్దుతో మొదలైన మోడి షాకులు ఇప్పటికి బంగారం వరకూ వచ్చి ఆగింది. రేపటి రోజున ఏమి షాకిస్తారోనని దేశప్రజలందరూ హడలిపోతున్నారు.
నోట్ల రద్దుతో పడిన దెబ్బ నుండే ప్రజలు కోలుకోలేక అవస్తలు పడుతుంటే తాజాగా బంగారం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం మీద అల్లకల్లోలం మొదలైంది. ముఖ్యంగా మహిళా లోకం మోడి నిర్ణయంపై తీవ్రంగి మండిపడుతోంది. మోడి దెబ్బకు ఏమి మాట్లాడాలో అర్ధం కాకుండా మిత్రపక్షం టిడిపి కూడా అయోమయంలో పడిపోయింది.
బంగారం నిల్వలపై మొదటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయడు మాట్లాడుతూ కొద్దిపాటి నిరసనను తెలియజేసారు. దాంతో పార్టీ నేతలు రెచ్చిపోయారు. విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బొండా ఉమ మాట్లాడుతూ, బంగారం నిల్వలపై మోడి తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్యగా వర్ణించారు.
అదేసమయంలో మోడి చర్యను తప్పుపడుతూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ధ్వజమెత్తారు. బంగారం జోలికి వెళితే మహిళలు ఊరుకోరని మోడిని హెచ్చరించటం గమనార్హం.
ఇక, అధికార పార్టీ నేతలు చెబుతున్నదాన్ని బట్టి త్వరలో మరికొన్ని షాకులు తప్పవని అనిపిస్తోంది. ప్రస్తుతం ముద్రిస్తున్న రూ. 2 వేల నోట్లను కూడా వచ్చే సంవత్సరం చివరలో రద్దు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇపుడు విపరీత ప్రచారం చేస్తున్న ప్లాస్టిక్ మనీ అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, రూపే, మనీ కార్డులు తదితరాలన్నీ రద్దు చేసే విషయాన్ని ప్రధాని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా వ్యక్తిగత ఆస్తులను కూడా రద్దు చేసే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. ఇపుడు ఎవరి ఎవరి పేర్లతో ఉన్న ఆస్తులు మొత్తాన్ని రద్దు చేసే అన్నింటినీ డిజిటలైజ్ చేసి వాటన్నింటికీ ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని మోడి యోచిస్తున్నట్లు సమాచారం.
సంతకాల పోర్జరీ నివారణకు ఆస్తి హక్కుదారుల వేలి ముద్రలను కానీ లేక కనుపాపల(ఐరిస్)కు అనుసంధానించాలని అనుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. మోడి ఏమి చేయబోతున్నారో భగవంతునికే తెలియాలి.
