నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం.. మహిళపై అత్యాచారం

psycho veerangam in nellore district kovuru city
Highlights

  • ఒంటరి మహిళలే లక్షంగా దాడులు  చేసిన సైకో

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు.గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నాయీ బ్రాహ్మణవీధిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహిళ అరుపులు విన్న స్థానికులు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పారిపోయాడు.  అనంతరం ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో.. ఆమె తీవ్రగాయాలపాలైంది.  వృద్ధురాలిని, అత్యాచారానికి గురైన మహిళ.. ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

loader