హైదరాబాద్ లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Prostitution Racket Busted In Hyderabad five women arrested
Highlights

  • హైదరాబాద్ లో మరో సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. మాదాపూర్‌ హైటెక్‌సిటీలో ఓ అపార్ట్‌మెంట్‌లో, బంజారాహిల్స్‌ లో నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడిచేసి ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. మాదాపూర్‌ ఖానామెట్‌లోని ఓ అపార్ట్‌ మెంట్‌, ఫ్లాట్‌నెంబర్‌ 503లో  ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం రాత్రి దాడిచేశారు. బెంగళూరుకు చెందిన పప్పిమోసూర్‌(28)అనే మహిళను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అదే అపార్ట్‌ మెంట్‌లో మరో ఫ్లాట్‌లో బెంగళూరుకు చెందిన విజయ్‌భాస్కర్‌ ముగ్గురు మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. దాడిచేసిన పోలీసులు  ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు విజయ్‌భాస్కర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 9లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడిచేశారు. ఇద్దరు యువతులకు విముక్తి కల్పించి నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిర్వాహకురాలి కోసం బంజారాహిల్స్‌ పోలీసులు గాలిస్తున్నారు.

loader