ఒక షాపులో సగటున వెయ్యి బీర్లు అమ్ముడుపోతే షాపు వాళ్లకి రూ. 5 వేలు అదనపు ఆదాయం అందుతోంది.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అన్నీ వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి. అయితే, ఇంతటి కరెన్సీ సంక్షోభంలో కూడా లాభపడుతున్న వ్యాపారం ఒకటుంది. అదేమిటంటారా? రీటైల్ మద్యం వ్యాపారం. బీరు ధర ఇంతకుముందు రూ.105. కానీ ఎక్కడా చిల్లర దొరక్కపోవటంతోనే వీరికి లాభాలు పంట పండుతోంది.

ఎలాగంటే, మిగితా అందరి వద్ద ఉన్నట్లే బీరు వినియోగదారుల వద్ద కూడా చిల్లర ఉండటం లేదు. అందుకనే బీరు కొనుగోలు చేసిన వారు షాపుల్లో రూ. 110 ఇస్తున్నారు. అయితే, తమ వద్ద చిల్లర లేదన్న కారణంతో షాపుల వారు 5 రూపాయలు తిరిగి ఇవ్వటం లేదు.

వినియోగదారులు కూడా 5 రూపాయలే కదా అని పెద్దగా పట్టించుకోవటం లేదు. దాంతో ఒక షాపులో సగటున వెయ్యి బీర్లు అమ్ముడుపోతే షాపు వాళ్లకి రూ. 5 వేలు అదనపు ఆదాయం అందుతోంది. చూసారా మోడి వల్ల మద్యం రీటైల్ దుకాణాల వాళ్లు ఎంత లాభపడుతున్నారో.