Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక చొప్రా... నువ్వు ఇండియా రావద్దు..

  • భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపింది
  • జాతీయ జెండాను దుప్పట్టాలాగా కప్పుకుంటావా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Priyanka Chopra Trolled For Not Wearing Sari On Independence Day Told Dont Return To India

ప్రియాంక చొప్రా... నువ్వు ఇండియా రావద్దు..

 బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ కి తిరిగి రావద్దంటూ.. అమెరికాలోనే ఉండిపోమ్మని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ లో సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక.. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే.  హాలీవుడ్ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ప్రియాంక.. అమెరికాలో ఉన్నారు. కాగా.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపింది.

జీన్స్, టీషర్ట్  ధరించిన ప్రియాంక.. మూడు రంగులు( జాతీయ జెండా రంగులు) గల ఒక దుప్పట్టాన్ని మెడపై వేసుకొని దానిని చేతితో పట్టుకొని ఫోటోకి దిగింది. దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో మై హార్ట్ బిలాంగ్స్ టూ ఇండియా హ్యష్ ట్యాగ్ తో పోస్టు చేసింది.

ఆమె పెట్టిన పోస్టుకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా  సల్వార్ కమీజ్( పంజాబీ డ్రస్) వేసుకోకూడదా అంటూ కొందరు ప్రశ్నించగా.. ఇలాంటి రోజుల్లో నైనా కనీసం నీ నుంచి మేము చీర ఎక్స్ పెక్ట్ చేస్తాం కదా అని కొందరు కామెంట్ చేశారు. తనును అసలు భారత్ కి తిరిగి రావద్దని మరికొందరు కామెంట్ చేశారు. జాతీయ జెండాను దుప్పట్టాలాగా కప్పుకుంటావా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రియాంక దుస్తులపై నెటిజన్లు విరుచుకుపడటం ఇదేమి తొలిసారి కాదు.  భారత ప్రధాని నరేంద్రమోదీ కొంత కాలం క్రితం.. బెర్లిన్ వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక కూడా అక్కడే ఉంది.దీంతో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమయంలో ప్రియాంక. మెకాళ్లపై కి డ్రస్ ధరించి.. మోదీ ముందు కాలుపై కాలు వేసుకోని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. కాగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రధాని ముందు అలాంటి డ్రస్ వేసుకోవచ్చా.. అని కొందరు ప్రశ్నించగా.. తన డ్రస్ తన ఇష్టం అంటూ మరికొందరు ఆమెకు మద్దతు పలికారు.

Follow Us:
Download App:
  • android
  • ios