Asianet News TeluguAsianet News Telugu

దసరా పండగ బస్సుల దోపిడి ప్రారంభం

ఆర్టీసి 50 శాతం టికెట్ ధర పెంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంటే ప్రైవేటు ఆపరేటర్లు 200 నుంచి 300 శాతం ధర పెంచుతున్నారు

private bus operators exploit dasara festival demand and hike fare by 200 per cent

తెలుగు రాష్ట్రాలలో దసరా పండుగ ‘బస్సు’ల దోపిడీ మొదలయింది. ప్రభుత్వం ఒక పక్కనుంచి, ప్రయివేటు ఆపరేటర్లు మరొక వైపు నుంచి పండగ సీజన్ ను సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. కాకపోతే, ప్రభుత్వం సాధారణ టికెట్  రేటు మీద 50శాతం ఎక్కువగా వసూలు చేస్తుంటే, ప్రయివేటు ఆపరేటర్లు 200 నుంచి 300 శాతం వరకు వసూలు చేస్తున్నారు ఉదాహరణకు బెంగుళూరు నుంచి విజయవాడు ఎసి బస్ టికెట్  రు.1300 వుంటే ఇపుడు రు.3వేలకు పెంచేశారు. విజయవాడు, హైదరాబాద్ ల మధ్య ఎసి బస్ టికెట్ రు.600 ఉంటే దానిని డిమాండ్ బట్టి రు.1000 నుంచి 1500 లకు పెంచేశారు. ఎపి రాజధాని అమరావతికి వెళ్లడంతో  చాలా మంది ఉద్యోగులు పండగకు రావడానికి ప్రయివేటు బస్సులను నమ్ముకుంటున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు  ఈ నెల 21 నుంకి ప్రారంభమయుతున్నాయి. ప్రయివేటు పాఠశాలలకు ఈనెల 19 నుంచి శెలవులు ప్రకటించారు. అక్టోబర్ రెండు దాకా శలవులు ఉంటాయి. దసరా 28 న వస్తున్నది. దీనితో 22, 23,24 తేదీనలతో పాటు 27 వ తేదన టికెట్లకు విపరీతంగా డిమాండ్ వచ్చింది. దీనితో విజయవాడ-బెంగుళూరు, విజయవాడ-హైదరాబాద్, బెంగుళూరు- హైదరాబాద్, హైదరాబాద్- జిల్లా కేంద్రాలు, విజయవాడ- కొన్ని జిల్లాకేంద్రాలకు వెళ్లే బస్సుల టికెట్ల కోసం ప్రజలు పాట్లు పడటం మొదలయింది. దసరా ఉత్సవాలు ఈ నెల 30న ముగుస్తున్నాయి. అక్టోబర్ 1ఆదివారం. దీనితో  ఈ రోజుల్లో టికెట్ ధరలను ప్రైవేటు ఆపరేటర్లు విపరీతంగా పెంచేశారు. ప్రయివేటు ఆపరేటర్లు మొదట టికెట్లు లేవని చెబుతారు. అత్యవసరం కాబట్టి బతిమాలడం మొదలవుతంది. దీనితో వేలంగా టికెట్ ధర పెరిగిపోతున్నది. ముఖ్యంగా బెంగుళూరు, చెన్నై నుంచి వస్తున్న టెకీలు ఎంతధరయినా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక ఆర్టీసికిసంబంధించి రెగ్యులర్ బుకింగ్ లు పూర్తయ్యాయి. 50 శాతం అధిక ధరలతో స్పెషల్ బుకింగ్ నడుస్తున్నది. విజయవాడనుంచి కడపకు రోజూ 10 బస్సులున్నాయి. ఇలాగే కర్నూలుకు 17, అనంతపురానికి 8, పులివెందుల సెక్టర్ కు 8,పొద్దుటూరు సెక్టర్ 8 బస్సులునడుస్తుంటాయి. ఇపుడు ఈ ప్రాంతాలకు అదనంగా 70 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటికికూడా రిజర్వేషన్ పూర్తయింది.

హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతానికి  నడుస్తున్న సర్వీసుల సంఖ్య 170 కి పెరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు 180, బెంగుళూరునుంచి 15, ఛెన్నైనుంచి 25 సర్వీసులను ఏర్పాటుచేశారు. వీటన్నింటిలో రిజర్వేషన్ పూర్తయింది.

Follow Us:
Download App:
  • android
  • ios