చితకబాదిన ప్రిన్సిపాల్ కొడుకుపై ప్రేమతో.. (వీడియో)

Principal Cadet Collage Mastung Suspended Over Mismanagement
Highlights

విద్యార్థులను చావబాదిన వైనానికి సంబంధించిన ఒక వీడియో

పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌కు చెందిన మస్తుంగ్‌లోని ఒక కేడెట్ కాలేజీ విద్యార్థులను చావబాదిన వైనానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనకు కారకులైన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. బెలూచిస్థాన్‌లోని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ జావేద్ ఇక్బాల్ బంగష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియోలో రెడ్ కలర్ దుస్తులు ధరించిన విద్యార్థులను కాలేజీ మైదానంలో కొందరు చావబాదుతున్నట్లు కనిపిస్తుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్సిపాల్ బంగస్ కుమారుడిని తోటి విద్యార్థి కొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఆ ప్రిన్సిపాల్ విద్యార్థులందరిపైనా కఠిన చర్యలు తీసుకున్నాడు.

 

loader