ఈ నెల 16న ఏపీ బంద్ కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైకాపా ఎంపీల దీక్షను భగ్నం చేసినందుకు…అలాగే హోదా డిమాండ్ తో ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన తెలుగుదేశం ఎంపీల అరెస్టునకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. కాగా హోదా సాధన సమితి బంద్ పిలుపునకు జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. అదేవిధంగా వైసీపీ కూడా ఇదే రోజున బంద్ కి పిలుపునిచ్చింది. రాష్ట్ర బంద్ వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా పార్టీ సూచించింది.
ఇదిలా ఉండగా.. టీడీపీ సైకిల్ ర్యాలీ ఈనెల 22కి వాయిదా పడింది.