దాన్ని గుర్తించాలి: రాహుల్ గాంధీకి జవదేకర్ ఘాటు రిప్లై

దాన్ని గుర్తించాలి: రాహుల్ గాంధీకి జవదేకర్ ఘాటు రిప్లై

బెంగళూరు: కర్ణాటక వ్యవహారాలపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ సమాధానం ఇచ్చారు. కర్ణాటకలో బిజెపి కాంగ్రెసును ఓడించిందనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని ఆయన అన్నారు. 

కర్ణాటకలో బలనిరూపణకు తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. కాంగ్రెసుకు 78 సీట్లు వస్తే తమకు 104 సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. నకిలీ ఓటరు కార్డులతో, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెసు, జెడిఎస్ ప్రజలను మోసగించాయని ఆయన విమర్శించారు. 

అవినీతిని తిరగదోడకుండా కాంగ్రెసు, జెడిఎస్ మధ్య రహస్య అవగాహన కుదిరిందని ఆయన అన్నారు. కాంగ్రెసు చేసిన అవినీతిని తిరగదోడకూడదనే కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపారని ఆయన అన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ చోట ఓడిపోయి మరో చోట బొటాబొటీ మెజారిటీతో గెలిచారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రెస్ సెన్సార్ షిప్ ను తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెసు, జెడిఎస్ మధ్య పొత్తు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page