Asianet News TeluguAsianet News Telugu

ప్రసవానంతర వేదన...

 సోషల్ మీడియా రాకతో మనసు అగాథంలో బందీ అయిన కవి కట్లుతెంచుకుని విముక్తి అయ్యాడు. అనామకంగా ఉంటూనే చుట్టూర వస్తున్న మార్పులు చేర్పుల మీద కవితలల్లేస్తున్నాడు,కసి కక్కేస్తున్నాడు, చురకలేస్తున్నాడు, ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇలా ఒక  వ్యంగ్యాస్త్రాన్ని ఒక కవి సోషల్ మీడియా లోకి వదిలాడు. మీరే చూడండి,ఎంత పదనుగా ఉందో...

post partum anxiety of contemporary woman a parody

 

అప్పుడే ప్రసవం అయి... 
మెలకువ వచ్చింది ఆమెకు...
పక్కన తడిమి చూసుకుంది ... లేదు...
చేతికి ఏమీ తగలలేదు....

హయ్యో...ఎక్కడ?? 
ఆదుర్దా... మొదలయ్యింది
మనసంతా అలజడి...
ఇంతకీ ఏమయిందీ???

మంచం పక్కన ..  కిందా .. 
వూహూ ...  ఎక్కడా లేదు..

దృష్టి సారించి ... కళ్లతోనే
చుట్టూ వెదికింది. 
లాభం లేదు. ఏమైవుంటుందీ?
మనసు నిలవడం లేదు.

దూరాన మసక మసకగా కనిపిస్తోంది నర్స్...

ఓపిక తెచ్చుకొని ....
రమ్మని సైగ చేసింది....
పరుగు పరుగున వచ్చింది నర్స్..

ఉన్న శక్తి అంతా కూడ గట్టుకొని అడిగింది ... 
ఎక్కడా ...ఒక్కసారి ఇవ్వండి .... ప్లీజ్

పాపం బాలింత కంగారుపడుతోంది ... 
అనుకుని ... నర్స్  ... పరుగున పాపను అందించింది..

 

నర్స్ (ఆనందంగా) అనింది ఇదిగో తీసుకో ... ..ఇక నీ ఆదుర్దా ఆపుకుని ...

మనసారా చూసుకో నీ పాపాయిని ...

" బాలింత: "  హయ్యో ! నేను అడిగింది నా మొబైల్ ఫోన్..." 

ఇది వర్తమాన భారతం...

 

(రచయిత ఎవరో తెలియదు. సోషల్ మీడియానుంచి వచ్చి ఎసియానెట్ ఆఫీస్ లో  వాలింది. పట్టి ఇక్కడ బంధించేశాం)

Follow Us:
Download App:
  • android
  • ios