అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో కేసు వేశారు.  తనకు ట్రంప్ తో ఏడాది పాటు శారీరక సంబంధం కొనసాగిందని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.


బేవర్లీ హిల్స్ హోటల్ వద్ద ట్రంప్ బంగ్లాలో ట్రంప్ కలిసినట్లు ఆమె చెబుతున్నారు. 2006  నుంచి 2007 వరకు ఏడాది పాటు ట్రంప్ తనతో అఫైర్ నడిపినట్లు ఆమె చెబుతున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ తో తనకు ఉన్న సంబంధాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరుతూ.. కాగితాలపై సంతకం చేయించుకున్నారని.. అందుకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఈ మేరకు ఆమె న్యాయవాది మైఖేల్ కోర్టులో కేసు వేశారు. కాగా.. ఈ విషయాన్ని ట్రంప్ కొట్టిపారేస్తుండటం గమనార్హం.