జెసి గారి రాజ్యంలో పోలీసులిలా బతకాలి

police officers presenting bouquet and cake to son of Tadipatri MLA
Highlights

జెసి సోదరులే కాదు, వాళ్ల కొడుకుల దయకూడా ఉండాలి. లేకుంటే అంతే సంగతులు

అనంతపురం జిల్లాలో రిపబ్లిక్ ఆప్ తాడిపత్రి అని చిన్న సామ్రాజ్యం ఉంది. దానిని  జెసి సోదరులు పరిపాలిస్తుంటారు. అందులో పెద్ద జెసి అనంతపురం లోక్ సభ సభ్యుడు. చిన్న జెసి తాడిపత్రి ఎమ్మెల్యే. వారి పుత్రులు యువరాజులు.  అక్కడ  భారత రాజ్యాంగం కంటే, జెసి రాజ్యాంగమే అమలు చేస్తారు. వాళ్ల మనుషుల్ని భారత పోలీసులు అరెస్టు చేస్తే, జెసి సైన్యం స్టేషన్ మీద దాడి చేసి ఎందుకు అరెస్టు చేశారో, సంజాయిషీ అడుతుగుతంది. సంజాయిషీ నచ్చకపోతే, వూరిడిచి వెళ్లిపోమ్మంటారు. ఈ మధ్య ఇలాగే జరిగింది.చిన్ని జెసి వారు మంది మార్బలం వేసుకుని పోలీసుస్టేషన్ వెళ్లి వాళ్ల మనిషి ఎందకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని దబాయించారు. అంతేకాదు, వాళ్ల రాజ్యాంగం గౌరవించకపోతే, బదిలీ చేయించుకుని వెళ్లమని చెప్పారు... సరే పాత కథ అనుకుందాం.

 

అక్కడ రాజకుటుంబ సభ్యలంటే అంతా భయం భయంగా బతకాలి. వాళ్ల అశీస్సులు తీసుకుంటుఉండాలి.ప్రభుత్వోద్యోగులయినా, పోలీసులయినాసరే వాళ్ల మన్ననలు పొందాలి. వాళ్ల కనికరం ఉంటే జీవితం ప్రశాంతంగాసాగుతుంది. లేకుంటే... శంకరగిరి మాన్యాలే.

ఈ మన్ననల కోసం, కనికరం పోలీసులు అధికారులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తుంటారు. తాడిపత్రిపోలీసులకు ఇలాంటి ముహూర్తం జనవరి 1  కొత్త సంవత్సరం రోజున దొరికింది.

ఆ రోజు ఏం జరిగిందంటే...

తాడిపత్రి ఎమ్మెల్యే జెసిప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి. ఆయన చిన్న రాజా  వారి కుమారుడు కాబట్టి చిన్న యవరాజా.తగురీతిలో ఆయనను గౌరవించేందుకు తాడిపత్రిపోలీసులు జనవరి 1 ని వాడుకున్నారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని తాడిపత్రి రూరల్ సిఐ సురేంద్రనాథ్ రెడ్డి, అర్బర్ సిఐ భాస్కర్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్లి పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ స్వయంగా తినిపించారు ముద్దుగా. ఒక పదిరోజుల కిందటే ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మునిసిపల్ ఛెయిర్మన్ జిలానీ తదితరులు సిఐ భాస్కర్ రెడ్డి ఛెంబర్ లోకి వెళ్లి దుర్భాషలాడారు. ఏలిన వారి కోసం చల్లారేందుకు ఇలా పుష్పగుచ్ఛం తో వెళ్లడం కేక్ తినిపించడానికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాడిపత్రి రిపబ్లిక్ పోలీసులిలా బతకాలి. (ఫోటో సాక్షి నుంచి)

 

loader