తాత్కాలిక రాజధాని విజయవాడలో వరస దొంగతనాలుదిక్కుతోచని పోలీసులనగరంలోకి వస్తున్న కొత్త వారందరి మీద నిఘా మొదలు
విజయవాడ నగరంలో వరుస దొంగతనాలు జరగటంతో పోలిసులు నగరంలోకి వచ్చే కోత్తవారి మీద నిఘా ఉంచారు
వరస దొంగతనాలు మర్డర్ లతో ఒక్కసారిగా ఉల్కిపడ్డ పోలిసులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. నగర శివారులో న్యూరాజరాజేశ్వరి పేట లో తెల్లవారు జామున ఇంక నిద్రలో ఉన్న వారి ఇళ్లను వందలాది మంది పోలిసులు చుట్టుముట్టి తలుపులు తట్టటంతో కంగారు పడ్డ జనాలు తెరుకుని తలుపులు తెరచి పోలిసులు అడిగిన ప్రశ్నలకు నిద్ర మత్తులోనే సమాధానాలు చెప్పారు.
నగర శివార్లలో ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ నివాసాలు ఉంటున్నారని వారి మీద ఎటువంటి నిఘా లేకపోవడంతో నేరాలు జరుగుతున్నాయని అందుకని నగరంలో కి వచ్చే కోత్తవారి మీద నిరంతరం నిఘా ఉంటుందని అనుమానితులను అదుపులోకి తీసుకుటామని నగర డి సి పి క్రాంతిరానా టాటా చెప్పారు
వివిధ ప్రాంతాలనుండి వచ్చి వారి వద్ద ఎటువంటి అదారాలు లేకపోవడం తో సూమారు 700మంది ని ఐరిస్ తీసుకున్నారు ఈ విధానం వల్లన పాత నేరస్తులు అయితే దోరికిపోతారని అన్నారు సుమారుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ పోలిసులు బైక్ లు ఆటోలు కారులను తనీఖిలు చేశారు ఈ కార్యక్రమం లో ఎ సి పి శ్రామణి ,శ్రీనివాసరావు ,10సి ఐలు 30మంది యస్ ఐ లు వందలాదిమంది కానిస్టేబుల్ పాల్గొన్నారు
