అమరావతి దగ్గిర ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభ జరుగకుండా నిర్భంధం. మాదిగ నేతలు, ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలెవరూ అమరావతి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు.

ఈ రోజు అమరావతి లో మంద కృష్ణ మాదిగ తలపెట్టిన కురుక్షేత్ర మహసభ జరగకుండా పెద్ద ఎత్తున నిర్బంధం మొదలయింది.

అమరావతికి తరలి వస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టుచేయడం మొదలు పెట్టారు. ఎస్ సి రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ మాదిగల రాజధానిలో కురుక్షేత్ర సభని ఏర్పాటుచేయాలనుకున్నారు. దీనికోసం ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగా కృష్ణాజిల్లాలోని పుణ్యక్షేత్రాలన్ని సభ విజయవంతం కావాలని పూజలు చేశారు. జనసమీకరణకు పిలుపునిచ్చారు.

అయితే, ఈ సభకుఅనుమతి లేదని అందువల్ల కొనసాగనీయమని నిన్న హోం మంత్రి చిన్న రాజప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. సభకు వెళ్ళకుండా ముందస్తుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సానుభూతి పరులను అరెస్టు గుడివాడ పోలిసులు అరెస్టు చేశారు. దానిలో భాగంగా వై యస్ అర్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ఎమ్మార్పీఎస్ సానుభూతి పరుడు రవికాంత్ ని అరెస్టుచేశారు.

ఇబ్రహీంపట్నం మండలం తమ్మలపాలెం వద్ద జాతీయ రహదారిపై చెక్ పోస్టు ను ఏర్పాటు చేసి ప్రతి వాహనమును చెక్ చేశారు. కురుక్షేత్రం సభకు వెళ్ళేవాళ్ళందరిని పసిగట్టి దించి విజయవాడ 1 టైన్ పిఎస్ తరలిస్తున్నారు.

కంచికచర్ల మండల పరిధిలోని పలుగ్రామాలకు చెందిం40 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను కురుక్షేత మహాసభకు వెళ్తున్నారన్నా సమాచారంతో ముందస్తుగా నిర్బంధించి పోలిస్ స్టేషన్కు తరలించారు స్టేషను బయట మాట తప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నవారిని పోలీసులు స్టేషను లోనికి లాక్కొని వెళ్లారు.

ఇదే విధంగా శ్రీకాకుళం, విశాఖ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలలో కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అమరావతి వెళ్లకుండా పోలీసు అడ్డుకున్నట్లు సమాచారం.