బాధితుడి ఫిర్యాదు మేరకు అవినాష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులరో చెప్పాల్సిన అవసరమే లేదు. అందులోని కమెడియన్లు కూడా అంతే పాపులర్ అయిపోయారు. సినీ స్టార్ ల కంటే పెద్ద సెలబ్రెటీలు అయిపోయారు.
అయితే తమ చీప్ కామెడీతో ఒక్కోసారి వారు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ పై అవినాష్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

శివరాత్రి రోజున తాము ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ వస్తానని చెప్పిన ఆయన అడ్వాన్స్ గా డబ్బులు తీసుకున్నాడని తీరా సమయానికి జాడ లేకుండా పోయాడని వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అడ్వాన్స్ కింద తమ దగ్గర రూ.10 వేలు తీసుకొని ప్రోగ్రాం సమయానికి రాకుండా తమను ఇబ్బందులకు గురిచేశాడని ఫిర్యాదు లో పేర్కొన్నాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు అవినాష్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
