టెకీ హైందవిని దారుణంగా హత్య చేసిన యువకుడిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు

కడప జిల్లా ప్రొద్దుటూరు గౌతమి నగర్ లో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని కడప హైందవి కేసును పోలీసులు చేధించారు. 24 గంటలు తిరగక ముందే పోలీసుల నిందితుడిని గుర్తించి పట్టేశారు. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టడాని పోలీసులు గుర్తించారు. హైందవి మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా నవీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైందవి ఇంటికి నవీన్ వచ్చాడు. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు.
అత్యాచారయత్నం చేశాడు, అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ గొడవతో తన గుట్టు బయటపడుతుందని భయపడిన నవీన్ ఆమెను దారుణంగా హతమార్చాడు. దొంగలు ఇంట్లోపడి ఈ హత్యకు పాల్పడినట్లు కథని పక్కదారి పట్టించేందుకు హైందవి వంటిపై బంగారు ఆభరణాలతో పాటు, స్కూటీతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
