మొరాదాబాద్  సభలో పీఎం నల్ల డబ్బు ప్రజలకిస్తానని వెల్లడి

నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఎప్పుడైనా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాకు ప్రజలే హైకమాండ్‌ అని వెల్లడించారు.ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్‌ సభలో మోదీ ప్రసంగించారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన నేరమా? అవినీతి అంతానికి పోరాడినవాడు నేరస్తుడు అవుతాడా? అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ధనవంతులు ..పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారన్నారు.

జన్‌ధన్‌ ఖాతాల్లో ఎవరైనా డబ్బులు వేస్తే వాటిని వెనక్కి ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.దేశమంతా ఆన్ లైన్ లావాదేవీలకు మారాలని మరోసారి సూచించారు. మొబైల్‌ఫోన్‌లోకే బ్యాంకు వచ్చేసిందని, ఫోన్‌ ద్వారా ఎక్కడి నుంచైనా ఇప్పుడు లావాదేవీలు జరపవచ్చని తెలిపారు.