తమ బ్రతుకులు మారుతాయన్న నమ్మకం కూడా ప్రజల్లో ఏమీ కనబడటం లేదు. కాకపోతే గడచిన 50 రోజులుగా పడుతున్న కష్టాలకు ప్రజలు అలవాటు పడిపోవటం మాత్రం ఖాయం.
ప్రధానమంత్రి పదవి ఎంత చీప్ అయిపోయిందంటే ‘తప్పించుకు తిరుగువాడు నరేంద్రమోడి’ అని అనుకునేంత. నిజానికి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనేది మన దగ్గర చాలా పాపులర్ సామెత. అదే సామెతను ఇపుడు మోడికి అన్వయించి జనాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, నోట్ల రద్దు తర్వాత మోడి పార్లమెంట్ లో ప్రతిపక్షాలను ఎదుర్కోలేదు.
పార్లమెంట్ కు ప్రధాని వస్తారని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయడు ఎన్ని సార్లో చెప్పారు. ఉభయ సభల్లోకి మోడి వచ్చారు కానీ మౌనమునిలాగ కూర్చుని వెళ్లిపోయారు. అంతే కానీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటే, విపక్షాలడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మోడికి ఉన్నట్లు ఎవరూ అనుకోవటం లేదు.
అంత ధైర్యమే ఉండివుంటే, పార్లమెంట్ మొదలైన మొదటి రోజుల్లోనే సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడి ఉండేవారు. ఉభయ సభల్లో మాట్లాడని ప్రధాని బహిరంగ సభల్లో మాత్రం ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతుందటం గమనార్హం. సభల్లో మాట్లాడే విషయాన్ని పక్కనబెడితే కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. అందుకనే తప్పించుకు తిరుగుడు వాదు నరేంద్రమోడి అన్న కొత్త నానుడి పుట్టుకువచ్చింది.
నోట్ల రద్దై ఇప్పటికి నెల రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం ఏమాత్రం తీరలేదు. పైగా రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. లేనివాళ్లేమో మరింత లేనివాళ్ళయిపోతుంటే, ఉన్న వాళ్లేమో మరింత ఆడంబరంగా బ్రతుకుతున్నారు. దాంతో సామాన్యులకు కడుపు మండిపోతోంది. దాంతో ఏమి చేయాలో తోచక ఎదురుగా కనిపిస్తున్న బ్యాంకులు, ఏటిఎంలపైకి దాడులు చేస్తున్నారు.
నోట్ల రద్దు చేసిన రోజు సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారమైపోతాయన్న మోడి, ఆ తర్వాత 50 రోజులు త్యాగాలు చేయండి మీ బ్రతుకులు మారిపోతాయని చెప్పారు. చేతిలో డబ్బులు లేకపోవటంతో సామాన్యుల బ్రతుకులు నిజంగానే మారిపోతున్నాయి.
ప్రధాని చెప్పిన 50 రోజుల్లో ఇప్పటికి పూర్తయింది 32 రోజులే. ఇంకా 18 రోజులున్నాయి. మిగిలిన రోజుల్లో ఏదో అద్భుతం జరుగుతుందని, తమ బ్రతుకులు మారుతాయన్న నమ్మకం కూడా ప్రజల్లో ఏమీ కనబడటం లేదు. కాకపోతే గడచిన 50 రోజులుగా పడుతున్న కష్టాలకు ప్రజలు అలవాటు పడిపోవటం మాత్రం ఖాయం.
