Asianet News TeluguAsianet News Telugu

గౌరిని చంపడానికి  వాడిన తుపాకీ.. స్మార్ట్ ఫోన్ కన్నా చౌక

  • జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుకు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
  • స్మార్ట్ ఫోన్ ధర కన్నా తక్కువ ధరలో ఈ తుపాకీ దొరుకుతుందని వారు చెప్పారు
Pistol used to kill Gauri cheaper than smartphone easily available

బెంగళూరులో అతి దారుణంగా హత్యకు గురయిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్  కేసుకు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను చంపాడిని ఉపయోగిచిన తుపాకీ..కంట్రీ మేడ్ తుపాకీగా గుర్తించారు. ఈ తుపాకీ.. చాలా సులభంగా ఎవరికైనా దొరుకుతుందని సిట్ అధికారులు చెబుతున్నారు.

 

గత నాలుగు రోజుల క్రితం నలుగురు దుండగులు.. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను ఆమె ఇంటి వద్దే కాల్చిచంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె హత్య కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలను సిట్ అధికారులు మీడియాకు తెలియజేశారు.

 

వారు తెలిపిన విషయాల ప్రకారం.. కంట్రీ మేడ్ తుపాకీతో ఆమెను కాల్చి చంపారు. స్మార్ట్ ఫోన్ ధర కన్నా తక్కువ ధరలో ఈ తుపాకీ దొరుకుతుందని వారు చెప్పారు. హత్య జరిగిన ప్రాంతంలో  స్ట్రీషన్ మార్క్స్ గుర్తించినట్లు వారు తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ లాగే ఇవి కూడా యూనిక్ గా ఉంటాయని వారు చెప్పారు.

 

గౌరిని చంపడానికి ఉపయోగించిన తుపాకీ బులెట్లు.. ఎంఎం కల్బర్గీ, యాక్టివిస్ట్ నరేంద్ర దబోల్కర్, సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్ గోవింద్ పన్సారేలను చంపడానికి ఉపయోగించిన బులెట్లతో మ్యాచ్ అయ్యాయని వారు చెప్పారు. అంటే వీరిని చంపడానికి ఉపయోగించిన తుపాకీ తోనే గౌరీని కూడా చంపారని పోలీసులు గుర్తించారు.

 

అయితే.. కర్ణాటక హోం మినిష్టరీ రికార్డుల  ప్రకారం.. 2014, 2015 సంవత్సరాలలో లైసెన్స్ లేని దాదాపు 362 తుపాకీలను బ్యాన్ చేశారు. దేశంలో అక్రమ ఆయుధాలను బ్యాన్ చేయడంలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది.

అయితే.. కొందరు ఆర్మీ అధికారులు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో  అక్రమ   ఆయుధాల యూనిట్లను నిర్వహిస్తున్నారని విశ్రాంత అసిస్టెంట్ పోలీసు కమిషనర్  బీబీ అశోక్ కుమార్ తెలిపారు.

 

కంట్రీ మేడ్ తుపాకీలు ముంబయి, ఢిల్లీ నుంచి సరఫరా జరుగుతుందని ఆయన చెప్పారు. తాజాగా.. కేరళలలో కూడా ఈ తుపాకీల యూనిట్లు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తుపాకీలు మార్కెట్ లో చాలా సులభంగా రూ.10వేలు, రూ.20వేలకే లభ్యమవుతాయని  అశోక్ చెప్పారు. అంతేకాకుండా తుపాకీ చాలా చిన్నగా.. చేతిలో ఇమిడి పోయేలా ఉంటుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios