తిరుమల వెంకన్న ఏంత ఫేమసో అక్కడి లడ్డూ అంతే ఫేమస్. అయితే టీటీడీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల భక్తులు పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లో నట్లు, బోల్టులు, పాన్ పరాగ్ లు పడుతున్నాయి.

 

దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ రోజు ఓ మహిళా భక్తురాలు కొన్న లడ్డూలో బొగ్గు కనిపించడంతో ఆమె అవాక్కైయింది.  విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది.

 

కృష్ణ జిల్లా చల్లపల్లికి చెందిన యామిని తిరుమల వెంకన్న దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనగోలు చేసింది. ప్రసాదంలో బొగ్గు ముక్కలు కనిపించడంతో షాక్ తింది. ఈ విషయంపై టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసింది.