పండగలు పబ్బాలపుడు, సంతలలో, తిరునాళ్లలో జేబుదొంగుల చెలరేగుతారు. జేబుదొంగలున్నారని పోలీసులు లౌడ్ స్పీకర్లలో హెచ్చరిస్తూ ఉంటారు. అయితే, పెద్దోళ్ల పెళ్లిళ్లో, అందునా, ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యేలు హాజరయని పెళ్లిలో జేబు దొంగలున్నారని బోర్డులు పెట్టడం, మైకుల్లో అనౌన్స్ చేయడం బాగుండదు. అయితే, దీన్నే అసరా చేసుకుని శ్రీకాకుళం ఎంపి కింజారాపు రామ్మోహన్ నాయుడి పెళ్లికి విఐపిలతో పాటు జేబుదొంగలు కూడా వచ్చారు.

 

 అయితే, గుట్టు చప్పుడు కాకుండా, పెళ్లి జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్సలో చొరబడిన జేబుదొంగల బారి పడ్డవాళ్లలో  పోలీసు అధికారి కూడా ఉన్నారు.  విశాఖ సిఐడిలో డిఎస్పి గా పనిచేస్తున్న భూషన్నాయుడి పర్స్ ను ఎంపిగారి పెళ్లికొచ్చిన జేబు దొంగ కొట్టేశాడు.

 

 ఈ నెల 14న విశాఖలో రామ్మోహన్ నాయుడికి, పెందుర్తి ఎమ్మెల్యే  సత్యనారాయణకుమార్తె శ్రావ్యకు పెళ్లయిన సంగతి తెలిసిందే.

 

జేబు దొంగలెత్తుకెళ్లిన పర్సులో తొంబయివేల రుపాయలున్నట్లు భూషన్నాయుడు మొత్తకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన విశాఖ త్రీటౌన్ పోలీస్  స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పర్సులు పొగొట్టుకున్నమిగతా వారినుంచి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెప్పారు. భూషన్నాయుడెవరో కాదు, పెళ్లికొడుక్కి బాగా దగ్గరి బంధువు.