పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: హైదరాబాదులో ధరలు ఇవీ..

First Published 14, May 2018, 10:25 AM IST
Petrol, Diesel Prices Hiked After A Gap Of 19 Days
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికలు ముగిసి రెండు రోజులవుతోంది. ఇంతలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 19 రోజుల తర్వాత ఈ ధరలు పెరిగాయి. 

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికలు ముగిసి రెండు రోజులవుతోంది. ఇంతలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 19 రోజుల తర్వాత ఈ ధరలు పెరిగాయి. 

ఢిల్లీలో పెట్రోల్ ధర గత నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. అలాగే డీజిల్ ధర గత ఎనిమిది నెలల కాలంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. 

పెట్రోల్ ధర ఢిల్లీలో 17 పైసలు పెరగగా,  కోల్ కతాలో 18 పైసలు,త ముంబైలో 17 పైసలు, చెన్నై 18 పైసలు పెరిగింది. డీజిల్ ధర ఢిల్లీలో 21 పైసలు, కోల్ కతాలో 5 పైసలు, ముంబైలో 23 పైసలు, చెన్నైలో 23 పైసలు పెరిగింది. 

హైదరాబాదులో  సోమవారం డీజిల్ ధర లీటరుకు రూ. 71.8 ఉంది. హైదరాబాదులో డీజిల్ ధర లీటరుకు 26 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర ోసమవారంనాడు లీటరుకు 79.23 రూపాయలు ఉంది. పెట్రోల్ ధర హైదరాబాదులో 19 పైసలు పెరిగింది. 

సోమవారంనాడు పెట్రోల్ ధర లీటరుకు రూ.74.8, కోల్ కతాలో రూ.77.5, ముంబైలో రూ.82.65, చెన్నైలో రూ.77.61 ఉంది. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.66.14, కోల్ కతాలో రూ.68.68, ముంబైలో 70.43, చెన్నైలో రూ.69.79 ఉంది.

loader