హోలి పండగ అంటే.. ఒకరికి మరొకరు రంగులు పూసుకొని ఆనందంగా గడుపుతారు. కానీ.. దేశరాజధాని ఢిల్లీలో.. కొందరు యువకులు హోలీ పండగ పేరుతో వికృత చేష్టలకు పాల్పడ్డారు. వీర్యాన్ని బెలూన్స్ లో నింపి.. అమ్మాయిల మీదకు విసిరారు. దీంతో.. ప్రస్తుతం ఈ ఘటన వివాదాస్పదంగా మారింది.

పూర్తివివరాల్లోకి వెళితే.. మార్చి 1వ తేదీన హోలీ పండగ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే. ఢిల్లీ నగరంలో రెండు మూడు రోజులు ముందు నుంచే యువత హోలీ పండగ జరుపుకుంటున్నారు. కాగా..  రెండు రోజుల క్రితం.. కొందరు యువతులు అమర్ కాలనీ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుండగా.. కొందరు పోకిరీ యువకులు అడ్డుకున్నారు.  అమ్మయిల వెనకే ఫాలో అవుతూ.. కాసేపు విసిగించారు. అనంతరం బెలూన్స్ లో వీర్యం నింపి.. అమ్మాయిల మీదకు విసిరేశారు. ఈ వికృత చేష్టలకు అమ్మాయిలు ఖంగుతిన్నారు. వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హోలీ సందర్భంగా నగరంలో భద్రత పెంచాలంటూ అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. ఆ  యువతులు ఎల్ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థినులుగా తెలుస్తోంది.