షాకిచ్చిన పోలీసులు.. వీసా, పాస్ పోర్టుకి ఎసరు

First Published 4, Jan 2018, 5:13 PM IST
Persons caught in drunken driving cases may face difficulties in getting passport visa
Highlights
  • తెలంగాణ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు.

మందుబాబులకి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. రెండు రోజుల క్రితం న్యూ ఇయర్ వేడుకల్లో పీకలదాకా తాగి.. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డిన సంగతి తెలిసిందే. కాగా వారికి తెలంగాణ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుకున్నవారు వీసా, పాస్ పార్ట్ లు పొందడానికి వీలులేదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అనర్హుడేనని తేల్చి చెప్పారు. ఒక వేళ ఇప్పటికే పాస్ పోర్ట్ కి గానీ, వీసాలకు గానీ, ప్రభుత్వ ఉద్యోగానికి కానీ అప్లై చేసుకుంటే.. వెంటనే క్యాన్సిల్ చేయిస్తామని స్పెషల్ బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి సమాచారాన్ని సంబంధింత అధికారులకు ముందుగానే పంపిస్తామని వారు చెబుతున్నారు. ఆధార్ నెంబర్ సహాయంతో వారి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ రోజున కేవలం హైదరాబాద్ నగరంలో 2వేల మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వారిలో తెలుగు ఫేమస్ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడు.  

loader