తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. మూఢాలు అయిపోయి.. మంచి రోజులు మొదలయ్యాయి. దీంతో.. పెళ్లికి ముహుర్తాలు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 4వ తేదీన కేవలం తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మార్చి 4వ తేదీన హస్త నక్షత్రం, తిథి తదియ. ఎంతో శుభకరం కాబట్టి ఆరోజు వివాహం చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అందుకే చాలా మంది ఆ రోజునే పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు.

ఇక మార్చి 4వ తేదీ కాదు అంటే.. మార్చి నెలలో మరో రెండు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. మార్చి 6,11 తేదీలలో కూడా శుభలగ్నాలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లోనూ పెళ్లిళ్లు  బాగానే ఉన్నాయి. ఈ మార్చినెలలో కుదరకపోతే.. మళ్లీ ఏప్రిల్ లో శ్రీరామనవమి తర్వాతే మంచి ముహుర్తాలు ఉన్నాయి. కాబట్టి.. అందరూ మార్చి 4వ తేదీ ముహుర్తాన్నే ఫిక్స్ చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మంచి ముహుర్తాలు ఏవీ లేకపోవడం గమనార్హం.