కృష్ణా జిల్లా మైలవరంలో  ప్రజలు రా ఫ్ట్ర ప్రభుత్వానికి ఒక అరదైన పద్దతిలో నిరసన తెలిపారు.ఈ నిరసనకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎంతో  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలసిరి హారతి ని ఎన్నుకున్నారు.  ఇక్కడి ఆదాంపురం వాసులు తమ నివాసాలను ఆనుకొని పారుతున్న పీతురు మురుగు కాలువకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ‘జలసిరి’ హారతి ఇచ్చి నిరసన తెలిపారు. చిత్రమేమిటంటే, మైలవం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు సొంత నియోజకవర్గం. ఆయనను అభిమానులు రెండో అపరభగీరధుడు అంటుంటారరు. మొదటి అపర భగీరధుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.  మంత్రి నియోజకర్గంలో  అన్ని సమస్యలే. ఈ మధ్య వర్షానికి ఈ నియోజకవర్గం  మునిగిపోయింది.  ఈ పీతురు కాలువ సమస్య ప్రజలను ఏండ్లుగా పట్టిపీడిస్తున్నది. మైలవరం లో ఎన్నో ఏళ్లుగా  ఈ  పీతురు కాలువ  అనేక అనారోగ్యకర  సమస్యలను సృష్టిస్తున్నా మంత్రి పట్టించుకోవడంలేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఈ  సమస్యను  పరిష్కరించాల్సిన  బాధ్యత  నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మంత్రి వూరి సమస్యను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మంత్రి దేవినేని ఉమా ను నీటి పారుదల శాఖా మంత్రి అనేకంటే మురుగు నీటి శాఖా మంత్రి అనడం సబబు అని అంటున్నారు.  ఈ కాలువును వాళ్లు దేవినేని ఉమ కాలువ అంటున్నారు.

ఈ ఆగ్ర హాన్ని వెలిబుచ్చేందుకు  ఈ రోజు పీతురు మురుగుకాలువకు జలసిరి హారతి  పట్టారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో తాము నిరసన ను తీవ్రతరం చేస్తామని రిలే నిరాహార దీక్షలు చేయడానికి సైతం వెనుకాడమని స్పష్టం చేశారు.