Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ నేరాలెక్కువయితే ఇక ఆర్ సి రద్దు?

  • 12 పాయింట్లకు చేరుకుంటే.. వారి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు
  • ఆర్ సి రద్దు అయతే.. తిరిగి ఆ వాహనం రోడ్డు ఎక్కడానికి వీలు లేదు.
Penalty system rolls out cops mull RC suspension

 

 

హైదరాబాద్ నగర  పరిధిలో ఇటీవల మొదలుపెట్టిన ట్రాఫిక్ ఉల్లంఘన పెనాల్టీ పాయింట్ల సిస్టమ్ కొత్త మలుపులు తిరుగుతుంది.  తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి  డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయడంతో అధికారులు ఆగడం లేదు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్( ఆర్ సి) ని కూడా రద్దు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.  రెండు సంవత్సరాల కాలంలో..  ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి.. 12 పాయింట్లకు చేరుకుంటే.. వారి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ ఇదే కనుక అమలులోకి వస్తే.. ఒక సారి వాహన ఆర్ సి రద్దు అయతే.. తిరిగి ఆ వాహనం రోడ్డు ఎక్కడానికి వీలు లేదు. ట్రాఫిక్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినా పర్వాలేదు కానీ.. వాహన ఆర్ సీ నిమాత్రం రద్దు చేయ వద్దని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ అధికారులకు ఒక ప్రశ్న ఎదురైంది. ఈ పాయింట్ల వ్యవస్థపై వారు ఫీడ్ బ్యాక్ తీసుకోగా.. పలువురు కొన్ని ప్రశ్నలు సంధించారు.

  కాగా.. వారి ఫీడ్ బ్యాక్ ప్రకారం..వాహన యజమాని.. పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లను పొంది ఉండాలి. అంతే కానీ పరాయి వాహనాన్ని నడుపుతున్న వారిని వీటి గురించి అడగకూడదు. అంతేకాకుండా.. ఓ వ్యక్తి వేరే వాళ్ల వాహనాన్ని నడుపుతూ .. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే..వాహన యజమాని ఖాతాలో పాయింట్లు చేర్చకూడదని కోరారు.

కొందరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కుతుంటారని.. అలా దొరికిన వారు ఉపయోగించిన వాహనం వారిది కాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని  హైదరాబాద్ డిప్యుటీ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీసు రంగనాథ్ తెలిపారు. వాహనదారుల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ లను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

పెనాల్టీ పాయింట్లను.. ఆర్ సీతో లింక్ చేయడం చట్టరిత్యా నేరమని పలువురు చెబుతున్నారు. ట్రాఫిక్ అధికారులు చేపట్టిన ఈ పాయింట్ల విధానం చాలా మంచిదని.. దీని వల్ల రోడ్లపై డిసిప్లేయిన్ కనపడుతుందని ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అధికారి ఒకరు అన్నారు. కానీ.. ఆర్ సి ని రద్దు చేయడం సరైనది కాదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు యజమాని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాని.. ఒక వేళ యజమాని కాకుండా వేరే వ్యక్తి దానిని నడుపుతున్నా.. ఆ పత్రాలను వెంట తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుందని ఆయన చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios