పెజావర్ మఠం శ్రీ శ్రీ శ్రీ విశ్వేష తీర్థ స్వామీజీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అనంతరం ఆయన కర్నూలు లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. స్వామీజీ జనవరి 18 వ తేదీన ఉడుపిలో పర్యాయ వేడుక ముగిసిన తర్వాత కర్నూలు జిల్లాలోని మంత్రాలయ రాఘ వేంద్ర స్వామి సందర్శనకు వచ్చారు.  సాధారణంగా స్వామీజీ పర్యాయ తర్వత ఒక పుణ్యక్షేత్రం సందర్శించి ఉడుపి మఠం చేరుకుంటారు. ఈ సారి ఆయన మంత్రాలయం సందర్శించాలనుకున్నారు.  

19వ తేదీన మంత్రాలయం సందర్శించారు. మంత్రాలయం నుంచి ఆయన హైదరబాద్ చేరుకుని అక్కడి నుంచి విమానం లో బెంగుళూరు వెళ్లాల్సి  ఉంది. అయితే, మంత్రాలయం నుంచి కర్నూలు వస్తున్నపుడు  పెద్దపాడ గ్రామం దగ్గిర రాత్రి 9గంటలపుడు  రోడ్డు మలుపు దగ్గిర రోడ్డ మిట్టకు తగిలింది. దీనితో ఆయన అస్వస్థతకు గురయ్యారు. గాయాలేవీ తగల్లేదుగాని వెన్నెముక బెణికింది. అయితే, ఆయనను కర్నూలులోని హార్ట్ అండ్ మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. సోషల్ యాక్టివిస్టు, స్వామీజీ శిష్యుడు చంద్రశేఖర్ కల్కూర దగ్గరుండి ఆయన చికిత్స ఏర్పాట్లు చేశారు. డాక్టర చంద్రశేఖర్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్   డాక్టర్ రఘనందన్ స్వామీజీకి చికిత్స చేశారని కర్నూలు నుంచి కల్కూర ఏషియానెట్ ప్రతినిధికి చెప్పారు.

చికిత్స అనంతరం స్వామీ ప్రయాణానికి అనువుగా ఉన్నారని డాక్టర్ నిర్ధారించడంతో అర్థరాత్రే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి మంగళూరు కు విమానంలో వెళ్లిపోయారు. స్వామీజీ  సకాలంలో చికిత్స చేసిన డాక్టర్లకు ఆయన కల్కూర కృతజ్ఞతలు తెలిపారు.