సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ కామర్స్ సంస్థ ‘ పేటిఎం మాల్’ స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని 100 రిటైల్ స్టోర్లతో పేటీఎం మాల్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘ షాపింగ్ ఫెస్టివల్’ పేరిట ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఆఫర్లు కొనసాగనున్నాయి.

పేటీఎం మాల్ ఒప్పందం కుదుర్చుకున్న రీటైల్ స్టోర్స్ లో వస్తువులు, బట్టలు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి పేటీఎం  80నుంచి 100శాతం వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆఫర్లతోపాటు వినియోగదారులకు లక్కీ కూపన్లు, బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రతి రోజూ లక్కీ డ్రా తీసి.. అందులో విజేతగా నిలిచిన వారికి ద్విచక్రవాహనం  బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది.