పేటీఎం మాల్ రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు

Paytm Mall Republic Day Sale Offering Cashbacks Discounts on Smartphones
Highlights

  • భారీ ఆఫర్లు ప్రకటించిన పేటీఎం మాల్
  • స్మార్ట్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ 

పేటీఎం మాల్.. భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. ఇప్పటికే అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్లు, బిగ్ బజార్ వంటి రీటైల్ స్టోర్స్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించాయి. తాజాగా పేటీఎం మాల్ కూడా ఈ జాబితాలో చేరింది. గురువారం నుంచి పేటీఎం రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ఆఫర్లను, డిస్కౌంట్లను పేటీఎం మాల్ ప్రకటించింది.

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐఫోన్ X (64 జీబీ)అసలు ధర రూ.85,400 కాగా ఆఫర్ లో రూ.83,899 ధరకు లభిస్తోంది. ఇక 256 జీబీ మోడల్  ప్రస్తుత మార్కెట్ ధర రూ.99వేలు కాగా  ఆఫర్ లో రూ.98వేలకు అందుబాటులోకి వస్తోంది.  అలాగే ఐఫోన్ 8 (64 జీబీ) రూ.52,706 ధరకు, ఐఫోన్ 8 ప్లస్ (64 జీబీ) రూ.63,470 ధరకు లభిస్తున్నాయి. వీటితోపాటు వివో, మోటోరోలా, లెనోవో, శాంసంగ్, షియోమీ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లపై కూడా భారీ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐప్యాడ్ ప్రొ, ఐప్యాడ్ మినీలు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. డిస్కౌంట్లతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా పేటీఎం మాల్ అందిస్తోంది.

loader