పేటీఎం ‘గోల్డెన్’ ఆఫర్.. ఒక్క రూపాయికే బంగారం

First Published 28, Apr 2017, 2:09 PM IST
paytm gold coin offer on the occasion of akshaya tritiya
Highlights

పే టీఎం కంపెనీ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎంఎంటీసీ) తో జత కట్టి ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది.

అవును... నిజమే...ఒక్క రూపాయికే బంగారం కొనుక్కొనే గోల్డెన్ ఆఫర్...


ఆన్ లైన్ పేమెంట్ కంపెనీ పే టీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. గోల్డెన్ ఆఫర్ అంటే ఇంకా బాగుంటుందేమో...

 

అక్షయ తృతీయ రోజు అన్ని బంగారు షాపులు కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్స్ లు ఇస్తుంటే.. వాటిని తలదన్నే బాహుబలి ఆఫర్ ను పే టీఎం ప్రకటించింది. అయితే అలా కొన్న బంగారం మీ ఇంటికి వచ్చేయదు. మీ చేతితో తాకలేరు. అంతా ఆన్ లైన్ లోనే ఉండిపోతుందన్నమాట. ఏదో బంగారం కొనుక్కున్న తృప్తి మాత్రమే మీకు మిగులుతంది. ఒక్క రూపాయికి ఆ మాత్రం దొరికినా కూడా సంతోషమే కదా..

 

ఇంతకీ అలా బంగారం కొంటే ఏం చేయాలనే కదా మీ ప్రశ్న.

 

పే టీఎం కంపెనీ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎంఎంటీసీ) తో జత కట్టి ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది.

 

ఈ ఆఫర్ లో భాగంగా 24 కేరెట్ లు ఉండే 999.9 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని బిస్కట్ల రూపంలో కొనుగోళు చేయవచ్చు.

 

అయితే ఈ గోల్డ్ బిస్కెట్లు పేటీఎం డిజిటల్ వ్యాలెట్ లోనే ఉంటాయి కాబట్టి అందరూ వీటిని డిజిటల్ బిస్కెట్లు అంటున్నారు.

 

ఇలా మీ పేటీఎం లో ఉన్న డిటిటల్ బిస్కెట్లను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కింద వాడుకోవచ్చు.

 

ఇదీ పేటీఎం ప్రకటించిన ఒక్క రూపాయికే బంగారం కథ. తర్వపడండి ఈ అవకాశం త్వరలోనే ముగియనుంది.

loader