పవన్ సునామీ లేదు సుడిగాలీ లేదు...

First Published 10, Jan 2018, 11:33 AM IST
pawans pre election movie agnyaathavaasi is disappointing
Highlights

సినిమా కూడా ఆయన రాజకీయోపన్యాసంలాగే ఉత్తుత్తి ఆవేశమే....

2019 ఎన్నికల  ముందు ఒక బ్లాక్ బస్టర్ మూవీతో  పవన్  కల్యాణ్ ఫుల్ రేంజ్ పాలిటిక్స్ లో దిగుతారని అంతా అనుకున్నారు.  ఆయనను మరొక (రాజకీయ) బాహుబలిగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీచేయించే ఉద్దేశంతో అజ్ఞాతవాసి తీశారు.దానికి తగ్గట్టు గా ప్రిరిలీజ్ సినారియో మొత్తం రికార్డులే. టీజర్ యూట్యూట్ రికార్డ్. అమెరికాలో ప్రిరిలీజ్ బిజినెస్ రికార్డు. ధియేటర్ల సంఖ్య రికార్డు... ఒకటేమిటి అంతా రికార్డే. తీరా ఈ రోజు సినిమా చూసిన వాళ్లంతా  ఇది తుస్సు అన్నారు. రేటింగ్ చాలా మంది మూడు కూడా ఇవ్వడం లేదు. ఈ వార్త రాస్తున్పటిదాకా అంటే 11.30 దాకా వచ్చిన రేటింగ్ లలో 2.75 ఒక్కటే అధికం.

అజ్ఞాత వాసి ఆయన చివరి సినిమా అనుకున్నారు.  రాజకీయాలకుకావలసి పెట్టుబడి (పైసలు, పలుకుబడి) ఈ సినిమా తెస్తుందనుకున్నారు. చాలా ధియోటర్లలో విడుదల చేశారు కాబట్టి ఒపెనింగ్ డబ్బులు బాగా నే వచ్చి ఉండవచ్చే. అయితే, పూర్ టాక్.  ఒన మాన్ షో కూడా పూర్గా ఉందంటున్నారు.

అనంతపురం  సభలో మాట్లాడినపుడు పవన్ గొంతు చించుకుని బిగ్గరగా మాట్లాడి, అంతలోనే గొంతుతగ్గించి, మళ్లీ పెంచి, చాలా ఏమోషనల్ డ్రామా క్రియోట్ చేశాడు. దానికి తోడు, విప్లవకారుడు తరిమెల నాగిరెడ్డి పేరువాడుకుని వూగి వూగి మాట్లాడాడు. ఇక తెలుగు నాట విప్లవమే అనుకున్నారు. ఆయన జనసేన పార్టీ పెడుతున్నపుడు  ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా ఇలా వూగి వూగి... రెచ్చిపోయి, చాలా సార్లు అనసరం రెచ్చిపోయి, మాట్లాడారు. అనంతపురం మీటింగే ఆయన డ్రామకు చివరిది. ఆతర్వాతూ వూగుడు లేదు. తూగుడు లేదు.  రాజీడ్రా మా అయిపోయింది. ప్రభుత్వం బాగా పనిచేయాలి, అంతకంటే బాగా ప్రతిపక్షం బాగా చేయాలనే సలహాలు పడేస్తూవస్తున్నారు. పాలిటిక్స్ పూర్తిగా పార్ట్ టైం అయిపోయాయి. సేఫ్ హావెన్ ట్విట్టర్ మీది నుంచి ప్రకటనలు ( చాలా మటుకు తెచ్చిపెట్టుకున్న ఆవేశం).

పవన్ మానియా పని చేయలేదు. త్రివిక్రమ్ మ్యాజిక్ అంతకన్నా అధ్వాన్నంగా ఉంది.

ఒక  క్రిటిక్ కామెంట్ ఇలా ఉంది.  ఇది వాస్తవానికి బాగా దగ్గరగా ఉందని పిస్తుంది.

అజ్ఞాత వాసి సినిమా కూడా వూరికే హంగామా తప్పమరొకటి లేదు.  పాలిటిక్స్ లో కూడా...అంటే జనసేనలో ఆయన ఒన్ మాన్ షో నడిపిస్తున్నారు. సినిమాలో కూడా వన్ మాన్ షోయే.

ఇక అజ్ఞాతవాసి  సృష్టించే సినిమా సునామితో ఆయన 2019 ఎన్నికల్లో తలపడతారని అనుకున్నారు.

సునామీ లేదు. సుడిగాలీ లేదు. అంతటా నిరాశే...

loader